A person who earns 240 crores per day...! Its for You M

 

Image of Money, Cash Image

ఒక రోజుకి 240 కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి...! 

డబ్బులు సంపాదించడం అనేది మనందరికీ ఉండే కల.జీవితంలో  ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించడం కోసమే  పోరాటం చేస్తూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉన్న వారిలో కేవలం పది శాతం మంది మాత్రమే తమకు కావల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించ గలుగుతున్నారు... 

 ఎవరైనా ఒక నెలకు లక్ష రూపాయల డబ్బులు సంపాదిస్తే వాళ్ల గురించి గొప్పలు చెప్పుకుంటారు కానీ అదే ఒక రోజుకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 240 కోట్లు డబ్బు సంపాదిస్తే..! అలా సంపాదించడమే కాకుండా తన ఆస్తిలో 99% ఆస్తిని స్వచ్ఛంద సంస్థకు దానం చేసిన ఈయన గురించి ఏంఅనుకోవాలి ...ఆయనే మరెవరో కాదు ప్రపంచ దనవంతులలో సెకండ్ ప్లేస్ లో ఉండి ప్రస్తుతం 6th ప్లేస్ లో కొనసాగుతున్న ద గ్రేట్ "వారెన్ బఫెట్".  

Warren Buffett, Image of Warren Buffett, Richest Man, Its for you m
Warren_Buffett_Itsforyoum

ఆయన జీవితమే ఒక విలువైన ఆర్థిక పాఠం... 

న్యూస్ పేపర్లు, కోక్ బాటల్లు అమ్ముకొనే స్థాయి నుండి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి గా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ ఒక విలువైన ఆర్థిక పాఠం. మరిి అటువంటి వ్యక్తి జీవితం గురించి, ఆయన చెప్పిన విలువైన ఆర్ధిక సూత్రాల గురించి ఇక్కడ తెలుుకుందాం.

1930వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన అమెరికాలోని వోమహా పట్టణంలో జన్మించాడు వారెన్ బఫెట్.స్కూల్ లో తన తోటి పిల్లలు అందరూ ఆటపాటల్లో గడుపుతున్న సమయాల్లో ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు వేస్తూ, స్టాంప్ లు అమ్ముతూ, తన తాతగారి కిరాణా కొట్లో పని చేస్తూ కొద్ది కొద్దిగా డబ్బును కూడబెట్టాడు. అలా దాచిన డబ్బుతో పాత స్పిన్ బాల్ గేమ్ మెషీన్ ని కొని జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉంచాడు, దాంతో మంచి లాభాలు వచ్చాయి. అలా వచ్చిన డబ్బుతో తన 11 ఏళ్ల వయసులోనే ఎంతో రిస్క్ తో కూడుకున్న స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాడు. మొదట్లో నష్టాలు వచ్చినప్పటికీ తర్వాత నెమ్మదిగా లాభాలు రావడం మొదలయ్యాయి. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు బఫెట్. తన 14 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడంటే తను ఏ విదంగా సంపాదించాడో మీరు అర్థం చేసుకోవచ్చు. పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు మనకు ఆర్థిక జ్ఞానం ఏ విదంగా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.

19 ఏళ్ల వయసున్నప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే చిన్నవాడనీ వయసు సరిపోదని చెప్పి యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది. బఫెట్ కి స్టాక్ మార్కెట్ రంగంలో "Benjamin Graham" అంటే ఎంతో అభిమానం. ఆయన రాసిన " ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్" పుస్తకాన్ని చిన్న వయసులోనే బట్టీ పట్టేశాడు.ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకంగా "The Intelligent Investor" ప్రసిద్ది చెందింది. Benjamin Graham కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారని తెలిసి బఫెట్ కూడా అదే యూనివర్సిటీలో చేరాడు. తను కాలేజిలో చదువుతున్నప్పుడే ఒక రోజుకి 176 డాలర్లు సంపాదించేవాడు బఫెట్. ఆ కాలేజీలో క్లాసులు చెప్పే ప్రొఫెసర్స్ కి కూడా అంత సంపాదన వచ్చేది కాదు. 1962వ సంవత్సరంలో అప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి 'Berkshire Hathaway' అనే ఒక టెక్స్ట్ టైల్ కంపెనీలో ఎక్కువ మొత్తంలో షేర్లు కొన్నాడు బఫెట్. ఆయన ఆ కంపెనీలో షేర్లు కొనే సమయానికి ఆ కంపెనీ ఒక్కొక్క షేర్ విలువ 7 డాలర్లు. అంటే మన ఇండియన్ రూపీస్ లో 500 రూపాయలు. ఇప్పుడు ఆ కంపెనీ ఒక షేర్ విలువ ఒక కోటి అరవై రెండు లక్షలకు పైనే, ఇప్పటికీ అదే కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నారు బఫెట్. ఇదొక్కటే కాదు Coca Cola, Washington Post, American Express, IBM, Phillips, Gillette వంటి ఎన్నో కంపెనీల్లో బఫెట్ కి వాటా ఉంది.వారెన్ బఫెట్ ఏదైనా కంపెనీలో షేర్ కొన్నాడని తెలిస్తే చాలు అందరూ అదే కంపెనీలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టేవారు. దాంతో ఆ కంపెనీ షేర్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయేది. అప్పట్లో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలు తమ కంపెనీలో ఇన్వెష్ట్ చేయమని బఫెట్ ని బ్రతిమలాడేవి అంటే బఫెట్ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుండి మొదలైన ఆయన అప్పటికే వరుసగా 13 సంవత్సరాల నుండి ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్ ని దాటి 2008వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నెంబర్ వన్ స్థాయికి చేరాడు వారెన్ బఫెట్. 

వారన్ బఫెట్ కి ఉన్న ప్రత్యేక లక్షణాలు...

ఏదో కొంత సంపాదించగానే పెద్ద పెద్ద భవనాలు, పదుల సంఖ్యలో కార్లు, విలాసవంతమైన జీవితం గడిపేవారు ఉన్న ఈ రోజుల్లో, ప్రపంచ కుబేరుల్లో ఒక్కడై ఉండి కూడా ఎప్పుడో యాభై మూడు సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఒక సాధారణమైన ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఈయన ఇంటికి చుట్టూ ఒక గోడగాని, సెక్యూరిటీ గాని ఏమీ ఉండవు. ఈయన వాడేది ఒక సెకండ్ హ్యాండ్ కారు. ఆ కారుకి డ్రైవర్ గాని, చుట్టూ గాడ్స్ గాని ఎవరూ ఉండరు. ఈయనే స్వయంగా తన కారు ని నడుపుతూ ఉంటారు. అంతే కాదు "Jet nets" అనే ఒక పెద్ద విమానాల కంపెనీకి అధిపతి అయిన ప్పటికీ ఎన్నడూ సొంత పనుల కోసం విమానాన్ని ఉపయోగించలేదు. అంత సాధారణంగా జీవిస్తూ ఉంటారు ఈయన. ఈయన ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, అది, 'మీకు అవసరం లేనివి అన్ని కోనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు మీకు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త..!' అని. ప్రపంచంలోనే ధనవంతుడైన బిల్ గేట్స్ మొదటి సారి వారెన్ బఫెట్ ని కలవాల్సి వచ్చినప్పుడు, అందరి లాంటి వాడే అనుకోని కేవలం అరగంట సమయం మాత్రమే కేటాయిద్దాం అనుకున్నాడట. కానీ వారెన్ బఫెట్ మాటతీరు, మంచితనం, నిరాడంబరత చూసి ఏకంగా పది గంటల పాటు ఆయనతో గడిపాడట.ఆ మీటింగ్ తర్వాత బిల్గేట్స్, వారెన్ బఫెట్ కి అభిమానిగా మారిపోయాడు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు. అంతేకాదు బిల్ గేట్స్ నడుపుతున్న 'Bill & Melinda' అనే ఒక స్వచ్చంధ సేవ సంస్థకు వారెన్ బఫెట్ తన ఆస్తిలో సుమారుగా నలభై నాలుగు బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చేశాడు. 44 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ రుపీస్ లో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లకు పైనే ...

Warren Buffett, Bill gates, Warren Buffett with Bill gates, image of Warren Buffett and Bill gates,Itsforyoum
Warren_Buffett_with_Bill_Gates_Itsforyoum

ఆయనకు ఇప్పుడు ఉన్న ఆస్తులు సుమారుగా 99% సంపద ఆయనకు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది. పట్టిందల్లా బంగారం కావడం అనేది అదృష్టం బట్టి ఉంటుంది కానీ బంగారాన్నే పట్టుకోవడం అనేది నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. వారెన్ బఫెట్ కి ఆ నైపుణ్యం కావలసినంత ఉంది. ఆ నైపుణ్యం రావడానికి గల ఒకే ఒక కారణం పుస్తకాలను ఎక్కువగా చదవడం. ఈయన రోజులో 80 శాతం సమయాన్ని కేవలం పుస్తకాలు చదవటానికే కేటాయిస్తారట. అయితే తాజాగా 2017 సంవత్సరంలో ఫోర్బ్స్ మ్యాగ్జిన్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన ఆస్తి నాలుగు లక్షల తొంబై వేల కోట్లు. ఇంత సంపాదించడం ఒక ఎత్తయితే తను చనిపోయిన తర్వాత తన ఆస్తులలో 99% స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందేలా వీలునామా రాసి, మనసున్న కుబేరుడు అనిపించుకున్నాడు వారెన్ బఫెట్. అతి సామాన్య స్థాయి నుండి అత్యంత సంపన్నుడిగా ఎదిగిన బఫెట్ ఒక రోజు సంపాదన 37 మిలియన్ల అమెరికన్ డాలర్లు. అంటే ఒక రోజుకి రెండు వందల నలభై కోట్లకు పైనే. అంత సంపాదన ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా సామాన్యంగా జీవిస్తున్న ఈయన జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకం

చివరగా వారెన్ బఫెట్ జీవితాన్ని మార్చిన "ద ఇంటిలిజెంట్ ఇన్వెస్టర్" అనే పుస్తకాన్ని మీరు కూడా చదవాలనుకుంటే Amazon లేదా Flipkart లో కొని చదవవచ్చు... 

Click Here👉👉👉మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి ....



Click Here 👉👉👉షుగర్ వ్యాధి డయాబెటీస్ Diabetes అంటే ఏమిటి ? పూర్తి వివరాలు ....

👉👉👉మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ముందుగా పొందడానికి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ గంట సింబల్ పై క్లిక్ చేయండి....



2 Comments

Post a Comment

Previous Post Next Post