ఆచార్య - నీలాంబరి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు
Acharya-Neelambari Lyrical Song | Ram Charan, Pooja Hegde | Anurag Kulkarni, Ramya Behara
మెగా స్టార్ చిరంజీవి గారు చాల రోజుల తర్వాత ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొదటిసారి కొరటాల శివ గారు , చిరంజీవి గారికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా లో ఒక కీలక మైన పాత్ర చేస్తున్నాడు.రామ్ చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అందుకు తగ్గట్టు గానే ఈ చిత్రం లోని కీలకమైన నీలాంబరీ పాటను చిత్ర యూనిట్ ఈ మధ్యనే విడుదల చేసింది. అనుకున్నట్లు గానే ఈ పాట అభిమానుల అంచనాలకి మించి భారీ విజయం సాధించి సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచింది. ఒక్కసారి వింటే మల్లి మల్లి వినాలనిపించేంత వినసొంపుగా ఉన్న ఈ పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకురావడం జరిగింది,చూసి ఆనందించండి .
Song Name | Acharya-Neelambari Lyrical Song | Ram Charan, Pooja Hegde |
Singer(s) | Anurag Kulkarni, Ramya Behara |
Composer(s) | Mani Sharma |
Lyricist(s) | Ananth Sriram |
Music(s) | Mani Sharma |
Featuring Stars | Megastar Chiranjeevi, Megapowerstar Ram Charan, Pooja Hegde, Kajal Agarwal. |
Album | Acharya |
Music Label | Aditya Music |
Acharya-Neelambari Lyrical Song | Ram Charan, Pooja Hegde | Anurag Kulkarni, Ramya Behara
Neelambari Song Lyrics
ఆచార్య - నీలాంబరి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు
నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ ….నీలాంబరి
వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరి …నీలాంబరి
మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా…చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే…నన్నారి
నువ్వే చూపాలేమో…చిలిపి వలపు నగరి
నీలాంబరి…నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే…నీ అల్లరి
విడిచా…ఇపుడే
ప్రహరీ నిన్నే కోరి
గాలాలేయకోయ్…మాటలా జాలరి
ఒళ్ళో వాలదా చేపల నా సిరి
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి
నీలాంబరి…నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ…నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే… నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధా రఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి
నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరి నీలాంబరి
నీ అందమే నీ అల్లరి
👉👉👉 తెలుగులో మరిన్ని లేటెస్ట్ సాంగ్స్ లిరిక్స్ కోసం ఇక్కడ click చేయండి
YouTube Video
Post a Comment