జీవితంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు...
ఒకప్పుడు పుస్తకాలు చదివే అలవాటు చాలా మందికి ఉండేది.కానీ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో మనలో చాలా మందికి ఈ పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయిందనే చెప్పవచ్చు.అలా అని పుస్తకాల విలువ తగ్గిపోయింది అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అవి జ్ఞాన స్థావరాలు, వాటి విలువ ఎన్నటికీ తగ్గదు. కాకపోతే అందులో ఉన్న సమాచారమంతా ఇప్పుడు మన అర చేతిలో ఉండే మొబైల్ ఫోన్ లోకి వచ్చేసింది. నిజమైన పుస్తకాలకి బదులు PDF రూపంలో ఉండే ఆన్లైన్ పుస్తకాలు వచ్చేశాయి. కానీ నిజమైన పుస్తకాలను చదువుతున్నప్పుడు వచ్చే భావన, సంతృప్తి ఈ ఆన్లైన్ పుస్తకాలలో అందరికీ దొరకవు. కాబట్టే ఇప్పటికీ పుస్తక ప్రేమికులు, పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకున్నవారు మన చుట్టూ ఉన్నారు.
THE SECRET
![]() |
| THE_SECRET |
ఈ పుస్తకాన్ని" RHONDA BYRNE " అనే ఆవిడ రాశారు. ఈ పుస్తకం పుస్తక ప్రపంచం లోనే ఒక సంచలనం అని చెప్పవచ్చు. విడుదల చేసిన ఒక్క సంవత్సరంలోనే 19 కోట్లకు పైగా కాపీలు అమ్ముడైంది. అంతేకాదు ఈ పుస్తకం 40కి పైగా భాషలలో ట్రాన్స్లేట్ అయిందంటే దీని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకం అంతా ఒక మెయిన్ పాయింట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే " Law of Attraction ". అంటే మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుతుంది అది మంచైనా,చెడైనా. ఆ శక్తి మన మనసుకి, ఆలోచనకి ఉంది. మనం ఏదైనా ఒక పని జరగాలని గానీ, ఏదైనా సాధించాలి అని గానీ గట్టిగా అనుకోని నమ్మితే మనలో ఉండే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక రకమైన తరంగాలను ప్రకృతిలో కి విడుదల చేస్తుంది. అప్పుడు ఆ ప్రకృతి మనం అనుకున్నది జరగడానికి కావాల్సిన అవకాశాలను మనకు అందించి, ఒక మార్గాన్ని చూపెడుతుంది. ఇదే Law of Attraction.
మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. మన జీవితంలో వచ్చే సుఖాలకు కారణం మనమే, కష్టానికి కూడా కారణం మనమే అంటుంది ఈ పుస్తకం. కాబట్టి ఒక్కసారి ఈ పుస్తకం చదవండి. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఒక్కసారి అర్థమైతే మీ జీవితంలో ఏది కావాలి అనుకున్న కానీ అది ఆరోగ్యం, ఉద్యోగం, మంచి కుటుంబం, ప్రేమ, డబ్బు, స్వేచ్ఛ ఏదైనా కావచ్చు అవి అన్నీ మీ సొంతమవుతాయి.
Rich Dad Poor Dad
![]() |
| Rich_Dad_Poor_Dad |
మన చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఎందుకు కొంతమంది మాత్రమే ధనవంతులు గా ఉంటున్నారు..?ఎందుకు వాళ్ళు కష్టపడక పోయినా వాళ్ళ సంపద పెరుగుతూనే ఉంటుంది...? ఎందుకు కొంతమంది ఎంత కష్టపడినా పేదవాడి గానే మిగిలిపోతున్నారు...? మరి మనం కూడా ధనవంతులు గా మారాలంటే ఏం చేయాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ పుస్తకంలో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని" Robert Kiyosaki " అనే ఆయన రాశారు. ఈ పుస్తకం ఇప్పటికే కొన్ని కోట్ల కాపీలు అమ్ముడు పోయి టాప్ గా నిలిచింది. ఈ పుస్తకంలో Kiyosaki మనం ధనవంతులుగా మారడానికి పాటించవలసిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను చెప్పడం జరిగింది. డబ్బు కోసం మనం పని చేయడం కాదు,డబ్బు మన కోసం పనిచేయాలి. ఆ స్థాయికి ఈ పుస్తకము మిమ్మల్ని తీసుకు వెళుతుంది.మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన సంపద మన మెదడు. దానికి సరైన శిక్షణ ఇస్తే అది అపారమైన సంపదను సంపాదించి పెడుతుంది అని అంటాడు కియోసాకి. ఆర్థికంగా పైకి ఎదగాలి అనుకున్న వాళ్లు అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అయితే మీరు డబ్బుకి యజమాని కావాలి లేదా బానిస కావాలి. ఏం కావాలి అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. అని చెప్తుందిి ఈ పుస్తకం.
How to Win Friends & Influence People
![]() |
| How_to_win_friends_and_Influence_people_Itsforyoum |
ఈ పుస్తకాన్ని " DALE CARNEGIE " అనే ఆయన రాశారు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు గమనించినట్లయితే ఒక్కొక్క వ్యక్తిని అందరూ ఇష్టపడుతుంటారు, అతను ఏం చెప్పినా వింటారు, అతనితో కలివిడిగా ఉంటారు. కానీ అలాగే ఒక్కొక్క వ్యక్తి గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటారు, అతని మీద చిరాకు పడతారు అతన్ని వాళ్లలో కలవనివ్వరు. మనుషుల మధ్య ఇలాంటి వైరుధ్యాలు మనం తరచూ చూస్తూ ఉంటాము. ఇలా కాకుండా మిమ్మల్ని అందరూ ఇష్ట పడాలన్న, అందరూ మీతో కలిసి స్నేహంగా ఉండాలన్నా, మీరు చెప్పేది వినాలి అన్న ఏం చేయాలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. అంతే కాదు మన జీవితంలో పైకి ఎదగాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అటువంటి స్కిల్స్ ని ఎలా పెంచుకోవాలి, నలుగురిలో ఎలా మాట్లాడాలో ఒక శత్రువుని కూడా మిత్రుడులా ఎలా మార్చు కోవాలో ఈ పుస్తకంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకం చదివిన తర్వాత మీ ప్రవర్తనలో మార్పు రావడం మీరే గమనిస్తారు. అంత బాగుంటుంది ఈ పుస్తకం.
Think and Grow Rich
![]() |
| Think_and_Grow_Rich_Itsforyoum |
ఈ పుస్తకాన్ని " NAPOLEON HILL " అనే ఆయన 1937 లో రాశారు.కానీ ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అసలు ఈ బుక్ అంత ఫేమస్ కావడానికి కారణం ఏమిటో చూద్దాం. ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి విపరీతంగా రాత్రి పగలు కష్టపడి పోయి చెమటను చిందించి డబ్బులు పోగు చేయడం. రెండు కేవలం తన తెలివితేటలను ఉపయోగించి సులభంగా డబ్బు సంపాదించడం.ఈ పుస్తకం మిమ్మల్ని రెండో మార్గంలోకి తీసుకు వెళుతుంది. ఈ పుస్తకం మీ మైండ్ సెట్ ని, ఆలోచన విధానాన్ని, మార్చి మీకున్న లక్ష్యాలు సాధించడానికి దారి చూపెడుతుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి.
ఇక్కడ చెప్పిన ఈ పుస్తకాలు తప్పకుండా మీ జీవితంలో మార్పులు తీసుకొస్తాయి.మనం ఎన్నో సార్లు ఎంతో కొంత డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తాం, అందులో ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టి వీటిలో ఏదో ఒక పుస్తకాన్ని కొని చదవండి. మీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఈ పుస్తకాలకు ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
OK మై డియర్ ఫ్రెండ్స్... అందరికీ ఉపయోగపడే ఇలాంటి పుస్తకాల గొప్పతనం గురించి మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులు అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి.




Post a Comment