నువ్వు సిగ్గుపడితే - ఫుల్ వీడియో | బంగార్రాజు | అక్కినేని నాగార్జున | రమ్య కృష్ణ | అనూప్ రూబెన్స్_- చిత్ర, సాయి చరణ్ & రమ్య బెహరా
Nuvvu Siggupadithe - Full Video | Bangarraju | Akkineni Nagarjuna & Ramya Krishna | Anup Rubens - Chitra, Sai Charan & Ramya Behara Lyrics
అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన విజయంతో దానికి సీక్వెల్ ని తీసి మరొక్కసారి ఘన విజయాన్ని అందుకోవాలని ప్రయత్నించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా ఉండేందుకు బంగార్రాజు చిత్రం కోసం కష్టపడ్డారు ఆ చిత్ర బృందం మరియు అక్కినేని కుటుంబం.
ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా, అక్కినేని నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున మరియు రమ్య కృష్ణ మధ్యన తెరకెక్కించిన ' నువ్వు సిగ్గుపడితే ' పాటని ఇటీవల ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలించింది. ఈ పాటకి అభిమానుల నుంచి స్పందన భారీగా ఉంది. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలుస్తూ చక్కర్లు కొడుతున్న ఈ పాట యొ క్క తెలుగు లిరిక్స్ ని మరియు పూర్తీ వీడియో ని మీకోసం తీసుకొచ్చాము, చూసి ఆనందించండి.
Singer | Chitra, Sai Charan & Ramya Behara |
Composer | Anup Rubens. |
Music | Anup Rubens |
Song Writer | Kasarla Shyam |
Lyrics of Nuvvu Siggupadithe - Full Video
నువ్వు సిగ్గుపడితే లిరిక్స్ ఇన్ తెలుగు - ఫుల్ వీడియో
సిగ్గులో సింగారంఉంటాదే
వద్దన్న కొద్ది ముద్దొస్తావే న ఎన్నెలమ్మ
గారంగా చూస్తూనే గారం చేస్తావే
నువ్వు మాటలతో పడగొడతావే
ఓ బంగార్రాజు నవ్వులతో సెగ పెడతావే
నీ చూపులతో చుట్టేస్తావే నా రంగుల రాజా
సూదంటు రైళ్ళే లాగేస్తావే
మళ్ళి పుట్టానా అనిపిస్తుందే
ప్రాణంలా నువ్వు నను చేరితే
ఓ నువ్వు నేను ఒకటిగా ఏడున్న
నువ్వు నా సొంతమేగా ఏ లోకంలో ఉన్న
ఓ నువ్వు నేను ఒకటిగా ఏడున్న
నువ్వు నా సొంతమేగా ఏ లోకంలో ఉన్న
సుందరుడా సుందరుడా మీసమున్న సుందరుడా
అందమైన ఆశ పెట్టె నరుడా
ఊరు వాడా దిద్ద గోడ దూకినోడినే నీ కాడ
కాసుకున్నానంటే పడ్డనీడ
అరె అరె అరె చెరకుగడ జన్నుగడ
జున్నుపాల మీగడ మాటల్లోనే చూపించవే గురుడా
పూలజడ పొంగువాడా అద్దుకున్న పావడ
ఎత్తి తగ్గుతున్నదేంటే ఆడ
పొద్దు వానా పడంగా ఏలేలోన
స్వర్గమంటే ప్రతిపూటా నీతోటి మాటలే
ఓ నువ్వు నేను ఒకటిగా ఏడున్న
నువ్వు నా సొంతమేగా ఏ లోకంలో ఉన్న
Nuvvu Siggupadithe Full song
👇👇Watch this song full Vedio👇👇
👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్ చేయండి
Post a Comment