Naa Kosam Song Lyrics | Bangarraju | Naga Chaitanya

నా కోసం - ఫుల్ వీడియో సాంగ్ | బంగార్రాజు | నాగ చైతన్య | కృతి శెట్టి | అనూప్ రూబెన్స్ | సిద్ శ్రీ రామ్

Naa Kosam - Full Video | Bangarraju | Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens | Sid Sriram - Sid Sriram Lyrics

అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన విజయంతో దానికి సీక్వెల్ ని తీసి మరొక్కసారి ఘన విజయాన్ని అందుకోవాలని ప్రయత్నించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా ఉండేందుకు బంగార్రాజు చిత్రం కోసం కష్టపడ్డారు ఆ చిత్ర బృందం మరియు అక్కినేని కుటుంబం.  


ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున  సరసన రమ్యకృష్ణ నటించగా, అక్కినేని నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగచైతన్య మరియు కృతి శెట్టి మధ్యన తెరకెక్కించిన ' నా కోసం ' పాటని ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాకే హైలైట్ గా నిలిచిన ఈ పాటకి అభిమానుల నుంచి స్పందన భారీగా ఉంది. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో  నిలుస్తూ చక్కర్లు కొడుతున్న ఈ పాట యొ క్క తెలుగు లిరిక్స్ ని మీకోసం తీసుకొచ్చాము, చూసి ఆనందించండి.


Naa Kosam - Full Video | Bangarraju | Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens | Sid Sriram | Naa Kosam Full lyrics in telugu

Singer Sid Sriram
Composer Anup Rubens & Rakesh
Music Anup Rubens
Song WriterBalaji

నా కోసం - ఫుల్ వీడియో సాంగ్ | బంగార్రాజు | నాగ చైతన్య | కృతి శెట్టి | అనూప్ రూబెన్స్ | సిద్ శ్రీ రామ్

Lyrics of Naa Kosam - Full Video 

కొత్తగా నాకేమయ్యిందో

వింతగా ఎదో మొదలయ్యిందో

అంతగా నాకర్థం కాలేదే

మెరుపులా నీ చూపేమందో

చినుకులా నాపై వాలిందో

మనసిలా నీవైపే తిరిగిందే

ఇంకో ఆశ రెండో ద్యాస

లేకుండ చేసావు

మాటల్లేని మంత్రం వేసి

మాయలోకి తోసావు

నా కోసం మారావ నువ్వు

లేక నన్నే మార్చేసావా నువ్వు

నా కోసం మారావ నువ్వు

లేక నన్నే మార్చేసావా నువ్వు

ఓ నవ్వులే చల్లావు

పంచుకో మన్నావు

తొలకరి చిరుజల్లై నువ్వు

ఓ కళ్లకే దొరకావు

రంగులా మెరిసావు

నేలపై హరి విల్లా నువ్వు

నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా

నీతోనే ఉంటె ఇంకా ఇంకా బాగుంటా

మాటల్లోని మారాలన్నీ

మంచులాగా మార్చావు

నీ కోసం మారాలె నేను

నీతో నూరేళ్లు ఉండేలా నేను

నీ కోసం మారాలె నేను

నీతో నూరేళ్లు ఉండేలా నేను

ఓ మాటలే మరిచేలా

మౌనమే మిగిలేలా

మనసుతో పిలిచావా నన్ను ఓ…

కన్నులో అడిగేలా

చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను

పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా

నాకే ఈ వేళా నేనే నచ్చా నీ వల్ల

మోమాటలే దూరం చేసే

మాట నీకు చెప్పేలా

ఓ… నీ వెంటే ఉంటున్న నేను

నువ్వే లేకుంటే ఉంటానా నేను

నీ వెంటే ఉంటున్న నేను

నువ్వే లేకుంటే ఉంటానా నేను


Naa Kosam - Full Video | Bangarraju | Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens | Sid Sriram Watch Video

👇👇Watch this song full Vedio👇👇


👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్  చేయండి 


👉👉👉గుండెపోటు ఎందుకు వస్తుంది ..?




Post a Comment

Previous Post Next Post