Bangaara Song Lyrics | Akkineni Nagarjuna | Bangarraju

బంగార లిరికల్ సాంగ్ ( బంగార్రాజు ) తెలుగులో 

అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు అంచనాలు భారీగా ఉన్నాయి.సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన విజయంతో దానికి సీక్వెల్ ని తీసి మరొక్కసారి ఘన విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా ఉండేందుకు బంగార్రాజు చిత్రం కోసం కష్టపడుతున్నారు ఆ చిత్ర బృందం మరియు అక్కినేని కుటుంబం.  


ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున  సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, అక్కినేని నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి మధ్యన తెరకెక్కించిన 'బంగార ' పాటని ఇటీవల ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకి అభిమానుల నుంచి స్పందన భారీగా ఉంది. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో  నిలుస్తూ చక్కర్లు కొడుతున్న ఈ పాట యొ క్క తెలుగు లిరిక్స్ ని మీకోసం తీసుకొచ్చాము, చూసి ఆనందించండి. కొన్ని రోజుల్లోనే బంగార్రాజు సినిమాతో మన ముందుకు రాబోతున్న అక్కినేని నాగార్జున మరియు నాగచైతన్యలకి ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని కోరుకుందాం. 


Bangaara - Lyrical | Bangarraju | Akkineni Nagarjuna | Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens

https://www.itsforyoum.online/

Music Director: Anup Rubens Singers: Madhu Priya & Anup Rubens Lyrics: Bhaskarabhatla Programming: Anup, Kalyan & Ricky Violin: Sandilya Strings: Subhani Flute: Lalit Talluri

బంగార - లిరికల్ సాంగ్ | బంగార్రాజు | అక్కినేని నాగార్జున | నాగ చైతన్య | కృతి శెట్టి | అనూప్ రూబెన్స్

కాస్ట్ : అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు ఝాన్సీ

Bangaara song lyrics from Bangarraju in Telugu

కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టిలు కట్టుకొని
చెవులకి కమ్మలు వెట్టుకొని
చేతికి గాజులు వేసుకొని
సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడు వస్తావయ్యా
నిను సూడకుంటే గుండె కొట్టుకోదయా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా

ఓ… చీరకు కుచ్చిళ్లలాగా
జడకి రిబ్బనులాగా
ఉంటావా ఉంటావా
తోడుగా ఉంటావా
ఓ మూతికి ముడుపులాగా
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా వదలనంటగా
అంటుకుపోతావా నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా చెంపకి సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఎం కావాలో
చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగుడు పెళ్ళాంలా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా
బంగార్రాజు… బంగార్రాజు…

👇👇Watch this song full Vedio👇👇

                                                       

👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్  చేయండి 


👉👉👉గుండెపోటు ఎందుకు వస్తుంది ..?


1 Comments

Post a Comment

Previous Post Next Post