Komuram Bheemudo Song Lyrics | RRR

Komuram Bheemudo Song(Telugu)- RRR - NTR, Ram Charan 

రాజమౌళి గారు బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ NTR కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది ఆ చిత్ర బృందం. 

అందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషించిన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు కొమురం భీమ్ గారి పాత్రను వర్ణించే కొమురం భీముడో అనే పాటను విడుదల చేసారు. అభిమానుల అంచనాలను అధిగమించి ఈ పాట దూసుకుపోతుంది. విడుదల చేసిన కొద్ది నిమిషాలలోనే లక్షలలో వ్యూస్ ని సొంతం చేసుకొని సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో నిలుస్తోంది.సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ అద్భుతమైన పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీ ముందుకు తెచ్చాం. చూసి ఆనందించండి.

Komuram Bheemudo Song(Telugu)- RRR - NTR, Ram Charan | Keeravaani | Bhairava | SS Rajamouli| Kaala Bhairava Lyrics

Komuram Bheemudo Song | RRR


Song Name Komuram Bheemudo Song(Telugu)- RRR - NTR, Ram Charan | Keeravaani | Bhairava | SS Rajamouli
Singer(s) Kaala Bhairava
Composer(s) M M Keeravaani
Lyricist(s) Sudhala Ashok Teja
Music(s) An M M Keeravaani Musical.
Featuring Stars NTR, Ram Charan
Album RRR
Music Label Lahari Music

Komuram Bheemudo Song(Telugu)- RRR - NTR, Ram Charan | Keeravaani | Bhairava | SS Rajamouli | Kaala Bhairava Lyrics


కొమురం భీముడొ సాంగ్ లిరిక్స్ తెలుగులో  | RRR - NTR, రామ్ చరణ్ | ఎం ఎం కీరవాణి | భైరవ  | ఎస్ ఎస్ రాజమౌళి |  కాల భైరవ 

భీమా నిను కన్న నేల తల్లి
ఊపిరి పోసిన చెట్టు చేమ
పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతూర్రా
వినబడుతోందా
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
రగారాగా సూర్యుడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో

కాళ్లు మోక్త బాంచెన్ అని
వొంగి తొగలా
కారడవి తల్లికి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను
వొంచి తూగాల
దుడుము తల్లి పేగుల పెరగానట్టేరో
పెరగానట్టేరో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో

చర్మమొలిచె దెబ్బకు
ఒప్పంటు ఊగాలా
చిమికే రక్తము చూసి
చెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వొలికి తోగాల
భూతల్లి చనుపాలు తాగనట్టేరో
తాగనట్టేరో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో

కాలువై పారె నీ గుండె నెత్తురు
కాలువై పారె నీ గుండె నెత్తురు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మ కాళ్ళ పారానైతుంది చూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు
కొమురం భీముడొ
కొమురం భీముడొ
పుడమి తల్లికి జన్మ మరణమిస్తివిరో
కొమురం భీముడొ

YouTube Video

 

 👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్  చేయండి 


👉👉👉గుండెపోటు ఎందుకు వస్తుంది ..?




Post a Comment

Previous Post Next Post