గుండె పోటు Heart Attack ఎందుకు వస్తుంది...?
చూడడానికి చాలా ఆరోగ్యాంగా ఉన్న వ్యక్తి కూడా గుండె పోటు Heart Attack తో చనిపోయాడని వింటూ ఉంటాము.ఇంతకు ముందు వయసు పై బడిన వారిలో లేదా స్థూల కాయంతో బాధ పడుతూ లావుగా ఉండే వారిలో ఈ గుండె పోటు లేదా Heart Attack అనేది వస్తూ ఉంటుంది అనేవారు.కానీ మారిన జీవన శైలీ, కల్తీ ఆహారం, శారీరక శ్రమ లేమి కారణంగా ఆరోగ్యాంగా కనబడుతున్న యుక్త వయస్సు వారిలో కూడా గుండె పోటు Heart Attack ప్రమాదం పొంచి ఉంది.
అసలు గుండె పోటు Heart Attack ఎందుకు వస్తుంది...?
కార్డియాక్ అరెస్ట్ Cardiac Arrest అంటే ఏమిటి...?
గుండె పోటు Heart Attack రాకుండా ఉండాలంటే ఎం చేయాలి...?
గుండె పోటు Heart Attack మరియు కార్డియాక్ అరెస్ట్ Cardiac Arrest ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో వివరంగా తెలుసుకుందాం.
ఒక మనిషి గుండె రోజుకు సుమారు లక్షా 15 వేల సార్లు కొట్టుకుంటుంది. అలాగే గుండె రోజుకు సుమారు ఏడు వేల ఆరు వందల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మనింట్లో సంపు లో నీళ్ళు తోడే మోటార్ ఒక రోజంతా కంటిన్యూ గా పని చేస్తే చెడిపోతుంది. అలాంటిది మన గుండె నిరంతరాయంగా మన జీవిత కాలం పాటు పనిచేస్తుంది.
మరి ఇంత గొప్ప పనితీరు కలిగిన గుండె హఠాత్తుగా ఎందుకు ఆగిపోతుంది…?
ఇది అర్థం చేసుకోవడానికి ముందు మనం గుండె యొక్క నిర్మాణం అలాగే గుండె యొక్క పనితీరు తెలుసుకుందాం. గుండె యొక్క ముఖ్యమైన పని మన శరీరంలో అన్ని కండరాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ సప్లై చేయడం. ఆక్సిజన్ లేకపోతే మన కండరాలు పనిచేయవు శరీరంలో అన్ని కండరాలతో పాటు గుండె కండరాలకు కూడా ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అవుతూ ఉండాలి. అప్పుడే మన గుండె ఆగకుండా పనిచేస్తుంది. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలను కరొనరి ఆర్టెరీస్ అంటారు. ఈ రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడితే గుండె కండరాలకు రక్తసరఫరా ఆగిపోతుంది. గుండె పనిచేయడం ఆగిపోతుంది. దీన్నే హార్ట్ ఎటాక్ Heart Attack అంటారు. అయితే
రక్తనాళాల్లో అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయి…?
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ లో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుని రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వు ని బ్లాక్ అంటారు. కరొనరి ఆర్టెరీ లో బ్లాక్ ఏ మాత్రం పగిలినా అక్కడ రక్తం గడ్డ కడుతుంది.ఇలా రక్తం గడ్డ కట్టగానె గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి హార్ట్ఎటాక్ సంభవిస్తుంది. ఈ స్థితిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి రావడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి.
మొదటిది జీన్స్… అంటే వంశంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే తర్వాత తరాల వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక రెండవది మన లైఫ్ స్టైల్… అంటే మనం తినే ఆహారం, మనకు ఉన్న అలవాట్లు మొదలైనది.
వయసు పైబడటం, ఊబకాయం, ధూమపానం, మద్యం సేవించడం, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధితో బాధ పడుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్ కు ముఖ్య కారణం. కరోనరీ ఆర్టరీ డిసీజ్ Cardiac Arrest లేదా హార్ట్ ఎటాక్ Heart Attack ను గుర్తించిన తర్వాత రక్తాన్ని పలచబార్చే మందులు ఇస్తారు. అయితే ఈ సమస్య తీవ్రమైనప్పుడు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ కరొనరీ ఆర్టరీ డిసీజ్ లేదా హార్ట్ ఎటాక్ కు రెండు రకాల శస్త్ర చికిత్సలు ఉంటాయి. అవి
యాంజియోప్లాస్టీ Angioplasty
ఈ విధానంలో దెబ్బతిన్న రక్తనాళాల్లోకి క్యాథెటర్ అనే ట్యూబ్ ని పంపించి, బెలూన్ లాంటి పరికరంతో పేరుకుపోయిన కొవ్వుని వెనక్కు నెడతారు.ఆ మార్గం తిరిగి మూసుకుపోకుండా ఒక స్టంట్ ని వేస్తారు.ఈ చికిత్సని యాంజియోప్లాస్టీ ( Angioplasty ) అంటారు. ఇక రెండవది
బై పాస్ సర్జరీ Bypass Surgery
“ బై పాస్ సర్జరీ Bypass Surgery “ ఈ చికిత్సలో మన శరీరంలో వేరే చోట నుండి ఇంకొక రక్తనాళాలు తీసి దెబ్బతిన్నా లేదా పూడుకుపోయిన రక్తనాళానికి బైపాస్ చేస్తారు. ఈమె బైపాస్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అని అంటారు.
రక్తనాళాల్లో కొవ్వు బ్లాక్ అవడం ద్వారా కాకుండా వేరే విధంగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందా…?
YES ఉంది…దాన్ని కార్డియాక్ అరెస్ట్ Cardiac Arrest అంటారు.
గుండె కొట్టుకోవడం అనేది గుండెలోని నాడీవ్యవస్థ పంపే విద్యుత్ ప్రచోదనాలు అంటే Nerve Impulses మీద ఆధారపడి ఉంటుంది.ఈ వ్యవస్థలో ఒక వేళ ఏదైనా లోపం ఏర్పడి విద్యుత్ ప్రచోదనాలు సరిగ్గా సరఫరా జరగనప్పుడు గుండె లయ తప్పుతుంది. అతి వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం జరుగుతుంది.ఈ వ్యాధిని అరిద్మియా Arrhythmia అంటారు.అరిద్మియా Arrhythmia తో బాధపడే వారు అధికంగా జిమ్ చేయడం, అధిక శారీరక శ్రమ తో కూడిన ఆటలు అలాగే పరుగు పందాలు లాంటివి ఆడితే అడిగితే అంటే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ అరిద్మియా Arrhythmia ని సరిచేయడానికి గుండెలో బేస్ మేకర్ అనే పరికరాన్ని అమరుస్తారు.ఇది గుండె లైయను క్రమబద్దీకరించి కార్డియాక్ అరెస్ట్ Cardiac Arrest ని నివారిస్తుంది.
అసలు ఈ అరిద్మియా Arrhythmia కు గల కారణాలేంటి…?
జీన్స్ లేదా జన్యువుల్లో తేడా వల్ల లేకపోతే కొన్ని రకాల మందులు వాడడం వలన నాడీ వ్యవస్థలో వచ్చిన లోపాల వలన కలిగే అవకాశం ఉంటుంది.ఇంత క్లిష్టమైన నిర్మాణం మరియు పనితీరు కలిగిన మన గుండెను జాగ్రత్త గా కాపాడుకోవడం మన బాధ్యత.
మద్యపానం, సిగరేట్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం…
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం…
మంచి ఆహారం తీసుకోవడం…
అధిక కొలెస్ట్రాల్ కలిగిన పదార్థాలు తగ్గించుకోవడం...
ఇలాంటి అలవాట్ల ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇదే హార్ట్ ఎటాక్ Heart Attack మరియు కార్డియాక్ అరెస్ట్ Cardiac Arrest కు సంబంధించిన పూర్తి సమాచారం.
Suuuuuppper
ReplyDeleteGood information
Post a Comment