Saami Saami Pushpa Song lyrics

 

Saami Saami (Telugu) Lyrical | Pushpa Songs | Mounika Yadav Lyrics

సామీ సామీ (పుష్ప) సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు | అల్లు అర్జున్, రష్మిక మందాన | సుకుమార్
 దేవి శ్రీ ప్రసాద్ | మౌనిక యాదవ్ లిరిక్స్ 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ కెరీర్లో మొదటిసారి వైవిధ్యమైన ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరక్కెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ప్రతిష్టాత్మకంగా ఈ  చిత్రానికి దర్శకత్వం వహించడంతో పుష్ప చిత్రం పై అంచనాలు రెట్టింపయ్యాయి.


ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్ర సంగీతం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కష్టపడుతోంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రంలో ముఖ్యమైన ' సామి సామి  'అనే పాటని ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట అంచనాలను మించి ఘన విజయం సాధించి సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలుస్తోంది, ఈ పాట విన్న తర్వాత అభిమానులలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.రికార్డులని బ్రేక్ చేస్తూ ట్రెండింగ్ లో నిలిచి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకొచ్చాము , చూసి ఆనందించండి.

Saami Saami (Telugu) Lyrical | Pushpa Songs | Mounika Yadav Lyrics

Song Name Saami Saami (Telugu) Lyrical | Pushpa Songs
Singer(s) Mounika Yadav
Composer(s) Devi Sri Prasad
Lyricist(s) Chandrabose
Music(s) Devi Sri Prasad
Featuring Stars Allu Arjun, Rashmika Mandana
Album Pushpa
Music Label Aditya Music

 సామీ సామీ (పుష్ప) సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు 
అల్లు అర్జున్, రష్మిక మందాన 
సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ 
మౌనిక యాదవ్ లిరిక్స్ 

Saami Saami (Telugu) Lyrical | Pushpa Songs | Mounika Yadav Lyrics

నువ్వు అమ్మి అమ్మి అంటంటే
నీ పెళ్ళానై పోయినట్టుందిరా
సామి నా సామి
నిన్ను సామి సామి
నా పెనెవిటి లెక్క సక్కంగుందిరా
సామి నా సామి
నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే
నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే
ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి
నీ పక్కా పక్కన
కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి
నువ్వెళ్ళే దారే సుత్తా ఉంటె
ఏరే ఎండినట్టుందిరా
సామి నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి

పిక్కల పై దాకా
పంచెను ఎత్తే కడితే
పిక్కల పై దాకా
పంచెను ఎత్తే కడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామి
కార కిల్లి నువ్వు కసకస నములుతుంటే
నా ఒళ్ళు ఎర్రగా పండెను సామి
నీ అరుపులు కేకలు వింటావుంటే ఏ…
నీ అరుపులు కేకలు వింటావుంటే
పులకరింపులే సామి
నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామి
రెండు గుండీలు ఇప్పి గుండెను సూపితే
పాలకుండ లెక్క పొంగిపోతా
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి

కొత్త చీర కట్టుకుంటే
ఎట్టా ఉందొ చెప్పకుంటే
కొత్త చీర కట్టుకుంటే
ఎట్టా ఉందొ చెప్పకుంటే
కొన్న విలువ సున్నా అవదా సామి
కొప్పులోన పూలు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
పులగుండె రాలి పడదా సామి
నా కొంగే జారేటప్పుడు నువ్వు… ఆ…
నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామి
ఆ కొంటె గాలే జాలే పడదా సామి
నా అందం చందం నీదవ్వకుంటే
ఆడ పుట్టుకే బీడయిపోదా
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి

👉👉👉 తెలుగులో మరిన్ని లేటెస్ట్ సాంగ్స్ లిరిక్స్ కోసం ఇక్కడ click చేయండి 


YouTube Video

 

 

1 Comments

Post a Comment

Previous Post Next Post