పుష్ప - ద రైస్ శ్రీవల్లి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు
అల్లు అర్జున్, రష్మిక మందాన | దేవి శ్రీ ప్రసాద్ | సిద్ శ్రీ రామ్ | సుకుమార్
Pushpa - The Rise Srivalli(Telugu) | Allu Arjun, Rashmika | DSP | Sid Sriram | Sukumar| Sid Sriram Lyrics
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ కెరీర్లో మొదటిసారి వైవిధ్యమైన ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరక్కెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పుష్ప చిత్రం పై అంచనాలు రెట్టింపయ్యాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్ర సంగీతం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కష్టపడుతోంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రంలో ముఖ్యమైన ' శ్రీ వల్లీ 'అనే పాటని ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట అంచనాలను మించి ఘన విజయం సాధించి సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలుస్తోంది, ఈ పాట విన్న తర్వాత అభిమానులలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.రికార్డులని బ్రేక్ చేస్తూ ట్రెండింగ్ లో నిలిచి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకొచ్చాము , చూసి ఆనందించండి.
Song Name | Pushpa - The Rise Srivalli(Telugu) | Allu Arjun, Rashmika | DSP | Sid Sriram | Sukumar |
Singer(s) | Sid Sriram |
Composer(s) | Devi Sri Prasad |
Lyricist(s) | Chandrabose |
Music(s) | Devi Sri Prasad |
Featuring Stars | Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandann |
Album | Pushpa - The Rise |
Music Label | Aditya Music |
Pushpa - The Rise Srivalli(Telugu) | Allu Arjun, Rashmika | DSP | Sid Sriram | Sukumar | Sid Sriram Lyrics
అల్లు అర్జున్, రష్మిక మందాన | దేవి శ్రీ ప్రసాద్ | సిద్ శ్రీ రామ్ | సుకుమార్
పుష్ప - ద రైస్ శ్రీవల్లి సాంగ్ లిరిక్స్ తెలుగు లో .....
నిను చూస్తూ ఉంటె
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ
ముందుండే నేను
మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ
తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు
తలనే వంచాను
ఇంతబతుకు బతికి
నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ళ దుద్దులు పెడితే
ఎవతైనా అందగత్తె అయినా
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
👉👉👉 తెలుగులో మరిన్ని లేటెస్ట్ సాంగ్స్ లిరిక్స్ కోసం ఇక్కడ click చేయండి
YouTube Video
Post a Comment