పుష్ప దాక్కో దాక్కో మేక | పుష్ప దాక్కో దాక్కో మేక సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు
Pushpa - The Rise - Daakko Daakko Meka Song Lyrics in Telugu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ కెరీర్లో మొదటిసారి వైవిధ్యమైన ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరక్కెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పుష్ప చిత్రం పై అంచనాలు రెట్టింపయ్యాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్ర సంగీతం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కష్టపడుతోంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రంలో ముఖ్యమైన ' దాక్కో దాక్కో మేక 'అనే పాటని ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట అంచనాలను మించి ఘన విజయం సాధించి సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలుస్తోంది, ఈ పాట విన్న తర్వాత అభిమానులలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.రికార్డులని బ్రేక్ చేస్తూ ట్రెండింగ్ లో నిలిచి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకొచ్చాము , చూసి ఆనందించండి.
Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar | Sivam Lyrics
Song Name | Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar |
Singer(s) | Sivam |
Composer(s) | Devi Sri Prasad |
Lyricist(s) | Chandrabose |
Music(s) | Devi Sri Prasad |
Featuring Stars | Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna |
Album | Pushpa |
Music Label | Aditya Music Telugu |
పుష్ప - ది రైస్ (తెలుగు) దాక్కో దాక్కో మేక సాంగ్ లిరిక్స్ తెలుగు లో మీకోసం
నటన :- అల్లు అర్జున్ , రష్మిక మందాన
సంగీతం :- దేవీ శ్రీ ప్రసాద్
గానం :- శివమ్
దర్శకత్వం :- సుకుమార్
రచన :- చంద్ర బోస్
Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar | Sivam Lyrics
తందనే తనననేనానే
తందనే తనననేనానే
తాననే తందినానే తాననే తనననేనానే
వెలుతురు తింటది ఆకు
వెలుతురు తింటది ఆకు
ఆకును తింటది మేక
ఆకును తింటది మేక
మేకను తింటది పులి
మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి
ఇది కదరా ఆకలి
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటాడు కాళీ
ఇది మహా ఆకలి
ఆహ్ ఆహ్ ఆహ్
వేటాడేది ఒకటి
పరిగెత్తేది ఇంకోకటే
దొరికిందా ఇది సస్తాది
దొరక్కపోతే అది సస్తాది
ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూడిందే
హే దాక్కో దాక్కో మేక
పులొచ్చి కోరుకుద్ది పీక హుయ్
చేపకు పురుగు ఎరా
పిట్టకి నూకలు ఎరా
కుక్కకి మాంసం ముక్క ఎరా
మనుషులందరికి బతుకే ఎరా
ఆహ్ ఆహ్ ఆహ్
గంగమ్మ తల్లి జాతర
కోళ్లు పొట్టేళ్ల కోతర
కత్తికి నెత్తుటి పుతర
దేవతకైనా తప్పదు ఎర
ఇది లోకం తల రాతర
ఆహ్ ఆహ్ ఆహ్
ఏమరుపాటుగా ఉన్నావా
ఎరకే చిక్కేస్తావు
ఎరనే మింగే ఆకలుంటే
ఇక్కడ బతికుంటావు హా
కాలే కడుపు సూడదు రో నీతి న్యాయం
బలం ఉన్నోడి దేరా ఇక్కడ ఇష్టారాజ్యం
హే దాక్కో దాక్కో మేక
పులొచ్చి కోరుకుద్ది పీక హుయ్
అడిగితే పుట్టదు అరువు… అరువు
బ్రతిమాలితే బ్రతుకే బరువు… బరువు
కొట్టర ఉండదు కరువు
దేవుడికైనా దెబ్బె గురువు
ఆహ్ ఆహ్ ఆహ్
తన్నులు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు
బుద్దుడు చెప్పే పాఠం
బద్దుడు కూడా చెప్పాడే హే
తగ్గేదే లే
👉👉👉 తెలుగులో మరిన్ని లేటెస్ట్ సాంగ్స్ లిరిక్స్ కోసం ఇక్కడ click చేయండి
👇👇👇Watch full video song in full HD now👇👇👇
YouTube Video
👉👉👉 ఇలాంటి కొత్త కొత్త సాంగ్స్ లిరిక్స్ తో పాటు Full HD లో అందరికంటే ముందుగా చూసి ఆనందించడానికి ఇక్కడ కనిపిస్తున్న గంట సింబల్ పై క్లిక్ చేసి ఈ వెబ్సైటు లో పెట్టే కొత్త పాటలను వాటి యొక్క తెలుగు లిరిక్స్ తో సహా చూసి ఆనందించండి.
Post a Comment