Health Advantages of Blood Donation | Rumor's & Truths

Blood Donation _ Health  Benefits of Blood Donation _ Blood Donating after Effects _ Blood Donation process in Telugu _ Blood Donor Importance

రక్తదానం చేయడం ప్రమాదకరమా ..?
రక్తదానం చేయడం లో ఉండే అపోహలు మరియి నిజాలు మీకోసం..

Blood Donation Advantages in Telugu 

Blood Donation | Health Benefits of Blood Donation | Blood Donating after Effects | 
Blood Donor Importance | Blood Donation process in Telugu 


ప్రపంచం మొత్తం మీద ప్రతి 2 సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుంది. సరైన సమయానికి రక్తం అందక ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతున్నారు. మీకు తెలుసా..? తలసీమియా వ్యాధి సోకి ప్రతి రోజు ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. ఈ వ్యాధి సోకిన చిన్న పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి. ఏ ఒక్క సారి రక్త దొరక్కపోయినా వారి ప్రాణాలకే ప్రమాదం. మరి ఇంత మందికి కి రక్తం ఎలా దొరుకుతుంది. రక్తం అనేది ఏ ఫ్యాక్టరీ లోనో తయారు చేసి బాటిల్స్ లో అమ్మే వస్తువు కాదు. అది మనలోనే తయారు కావాలి దాన్నిమనమే దానం చేయాలి. అయితే ఈ రక్తదానం Blood Donation గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. రక్త దానం Blood Donation చేస్తే మన లో రక్తం తగ్గిపోతుందని,నీరసించి పోతామని,బరువు తగ్గిపోతారు అని ఇంకా ఏవేవో రకరకాల భయాలు మనలో చాలా మందికి ఉన్నాయి.

అసలు రక్తదానం Blood Donation చేయవచ్చా..?


చేస్తే ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా..?


ఏ వయసు వారు రక్తదానం Blood Donation చేయవచ్చు..?


ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


మన శరీరంలో సుమారు 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది.మనం ఒక్క సారి రక్త దానం Blood Donation చేస్తే మన శరీరం నుండి కేవలం 350 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే సేకరిస్తారు. దీనివల్ల మనకు ప్రమాదమేమీ ఉండదు ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఈ పోయిన రక్తం మన శరీరంలో మళ్లీ తయారవుతుంది. కానీ మన శరీరం నుండి ఒక సారి తీసిన ఆ రక్తం ముగ్గురి ప్రాణాలు నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. రక్త దానం Blood Donation చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు లేవు పైగా మనకి చాలా రకాల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి.

మన రక్తంలో ఒక్కొక్కసారి ఐరన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోయిన ఐరన్ అంతా మన గుండె దగ్గరికి చేరుకుంటుంది. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. హార్ట్ ఎటాక్ రావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. మరి ఇలా పెరిగిపోయిన ఐరన్ లెవల్స్ ను కంట్రోల్ చేసి వాటిని తగ్గించడానికి మరియు మన శరీరంలో ఐరన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం రక్తదానం Blood Donation. రక్త దానం Blood Donation చేయడం వల్ల మన శరీరంలో పెరిగిపోయిన ఐరన్ మినరల్ కొంత వెళ్లిపోవడం వల్ల మన శరీరంలో ఐరన్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటెన్ అవుతాయి. అంతేకాకుండా శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరి భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన శరీరంలో ఐరన్ లెవెల్స్ అదుపులో ఉండాలి. దాని కోసం రక్తదానం Blood donation ఖచ్చితంగా చేయాలి.


ఇటీవల శాస్త్రవేత్తలు రక్తదానం Blood Donation పై చేసిన పరిశోధనల్లో ఎవరైతే తరచుగా రక్త దానం Blood Donation చేస్తారో వాళ్లలో హార్ట్ఎటాక్ మరియు క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం 70 శాతం తగ్గినట్లు రుజువయింది. అంతేకాకుండా మనం రక్తదానం Blood Donation చేయడానికి ముందు మన రక్తాన్ని సేకరించి దానికి రకరకాల పరీక్షలు చేస్తారు. ఇందులో HIV, హిపటైటిస్, మలేరియా షుగర్, హిమోగ్లోబిన్ లెవల్స్ ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ మనకు ఏదైనా వ్యాధి ఉన్న కూడా అది మనకు ముందే తెలుస్తుంది.ఒక్కోసారి మన శరీరంలో B.P మరియు షుగర్ లెవెల్స్ మనకు తెలియకుండానే తిరిగి పోతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు రక్త దానం Blood Donation చేసేటప్పుడు చేసే పరీక్షల లో వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది అలాగే మనం ఒక్క సారి రక్త దానం Blood Donation చేస్తే మన శరీరంలో 650 కిలో కేలరీలు ఖర్చవుతాయట. దీనివల్ల మన శరీర బరువు అనేది అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.


ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికన్నా మనం రక్త దానం Blood Donation చేయడం వల్ల మన రక్తం వల్ల కొంతమంది ప్రాణాలు నిలబడతాయి అనే ఆనందం ఇంకా గొప్పది.మనం గమనిస్తే రోజూ మన కళ్ళ ముందే రోడ్డుపై ఎన్నో రకాల ప్రమాదాలు జరిగి రక్తం అవసరం ఉన్నవారు చాలామంది మనకు కనబడుతుంటారు. కాబట్టి రక్త దానం Blood Donation చేయడం వల్ల ఏదైనా అవుతుందేమో అనే భయాన్ని వదిలేయండి.మీ దగ్గరలో ఏదైనా రక్తదాన శిబిరం గాని బ్లడ్ బ్యాంకు కు గాని ఉంటే వెంటనే వెళ్లి రక్తదానం చేయండి.


అయితే రక్త దానం Blood Donation చేయాలంటే కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే

రక్తదానం Blood Donation చేసే వారి వయసు 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే అరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే రక్తదానం Blood Donation చేయాలి. అలాగే రక్తదానం Blood Donation చేసే వారి బరువు 50 కేజీల కంటే ఎక్కువగా ఉండాలి. రక్త దానం Blood Donation చేసే వ్యక్తి మద్యం సేవిస్తే 24 గంటల సమయం గడిచేంతవరకు వరకు ఆ వ్యక్తి శరీరం నుండి రక్తాన్ని సేకరించడం కుదరదు. కాబట్టి ఆల్కహాల్ తాగిన వారు 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే రక్త దానం Blood Donation చేయాలి.

Blood Donation _ Health  Benefits of Blood Donation _ Blood Donating after Effects _ Blood Donation process in Telugu _ Blood Donor Importance

తలసీమియా వ్యాధి తో బాధపడే పిల్లలకి పదిహేను రోజులకి ఒకసారి రక్తం దొరకాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఆ రక్త దానం Blood Donation చేసే వాళ్ళని వెతుక్కోవడానికి ఆ చిన్నారుల తల్లిదండ్రులు పడే బాధ వర్ణించలేనిది. 700 కోట్ల మంది జనాభా ఉండి కూడా రక్తం అందక ఎంతోమంది చనిపోతున్నారు అంటే అది మనకే సిగ్గుచేటు.ఒక సాధారణ మనిషిగా రక్తదానం Blood Donation చేయడం అనేది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ మీరు రక్తదానం Blood Donation చేసే వాళ్ళ దృష్టిలో వాళ్ళ ప్రాణాలని నిలబెట్టే దేవునితో సమానం. ఇంతకుముందు తో పోల్చితే ఇటీవల కాలంలో రక్తదానం Blood Donation గురించి మనదేశంలో అవగాహన పెరిగింది.ముఖ్యంగా యువత రక్తదానం Blood Donation చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ అవగాహన మాత్రమే సరిపోదు.చదువుకోని వారు కూడా రక్త దానం Blood Donation చేసే విధంగా ప్రోత్సహించి రక్తదానం Blood Donation చేయడం వల్ల కలిగే ఉపయోగాలు వాళ్లకు వివరించి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి.దీనివల్ల నిరక్షరాస్యుల లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలలో రక్తదానం Blood Donation పట్ల ఉన్న అపోహలు భయాలు తొలగిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరియు గిరిజన ప్రదేశాలలో సరైన అవగాహన లేక, సరైన సమయానికి రక్తం అందక ఎంతో మంది గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతూ ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు.ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అంటే అందులోని లోటుపాట్లను ముందుగా గ్రహించాలి అలాంటి లోటుపాట్లు లో ఈ రక్తదానం Blood Donation గురించి అవగాహన లేమి అనేది చాలా ముఖ్యమైన విషయం.రక్త దానం Blood Donation చేయడం వల్ల మనిషికి ఆరోగ్యకరమైన ఉపయోగాలే తప్ప అనారోగ్యకరమైన ప్రమాదాలు ఏవీ ఉండవు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.


అయితే  మరింకెందుకాలస్యం ఏ ఆదివారం నాడో లేదా ఖాళీగా ఉన్నప్పుడో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి దగ్గర్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి గాని లేదా బ్లడ్ బ్యాంకు కు గాని వెళ్లి రక్తదానం Blood Donation చేయండి. అలాగే ఇలాంటి అందరికీ ఉపయోగపడే విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వారిలోని భయాన్ని, అపోహలని పోగొట్టి చైతన్యాన్ని కలిగించండి.

         Be a Donor...Be a Hero...

Post a Comment

Previous Post Next Post