What is Diabetes | Effects of Diabetes

షుగర్ వ్యాధి  Diabetes ( డయాబెటిస్ )అంటే ఏమిటి ..? | What is Diabetes


https://itsforyoum.blogspot.com/

 “Diabetes” (డయాబెటిస్) ఇంకా సింపుల్ గా చెప్పాలంటే షుగర్ వ్యాధి. మన బంధువులలో గానీ లేదా మనకు తెలిసిన వాళ్లలో గానీ ఈ Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి  కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ప్రపంచంలో సుమారు నలభై ఆరు కోట్ల మంది ఈ షుగర్ Diabetes (డయాబెటిస్) వ్యాధి తో బాధపడుతున్నారు. అంటే ఈ (డయాబెటిస్) Diabetes ఎంత ప్రమాదకరమో అర్ధం అవుతుంది. International Diabetes  Federation లెక్కల ప్రకారం ఒక్క 2019 లోనే సుమారు నలబై రెండు లక్షల మంది కేవలం ఈ  Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి వాళ్ళ చనిపోయారు. దీనికి ముఖ్య కారణం మనలో చాల మందికి షుగర్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం. 

కాబట్టి ఈ రోజు మనం అసలు ఈ


షుగర్ వ్యాధి  Diabetes ( డయాబెటిస్ )అంటే ఏమిటి ..?


షుగర్ వ్యాధి  Diabetes ( డయాబెటిస్ ) ఎందుకు వస్తుంది..? 


షుగర్ వ్యాధి  Diabetes ( డయాబెటిస్ )  వచ్చినప్పుడు మన శరీరంలో ఏమి జరుగుతుంది..?


షుగర్ వ్యాధి  Diabetes ( డయాబెటిస్ ) వచ్చిన వారు ఏమి చేయాలి..?
 
అసలు ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? 


అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.Diabetes (డయాబెటిస్) షుగర్ ఉన్న వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి, ఎందుకంటే ఎదో షుగర్ ఉంది అంటే ఉన్నది అన్నట్లు కాకుండా అసలు దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం చాల అవసరం. కేవలం  Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రమే కాదు లేని వారికీ కూడా ఈ విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో దాని బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.కాబట్టి ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోండి.


అసలు  షుగర్ వ్యాధి  Diabetes (డయాబెటిస్)అంటే ఏమిటి ..?


మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు గ్లూకోజ్ గా విచ్ఛిన్నమవుతాయి. గ్లూకోజ్ అంటే మన రక్తంలో ఉండే ఒక రకమైన షుగర్ అన్నమాట. ఇలా గ్లూకోజ్గా మారినప్పుడే అవి మన రక్తం లో కలవగలవు. అప్పుడు రక్తం ఈ గ్లూకోజ్ని శరీరంలోని అన్ని కణాలకు తీసుకువెళుతుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ మన శరీరంలోని అన్ని కణాలలోకి వెళ్లి సెల్యూలర్ రిస్ప్రేషన్ జరిగి మనకు శక్తి వస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది కాణాల్లోకి లోకి వెళ్లాలంటే దానికదే వెళ్లలేదు. దానికోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. ఈ ఇన్సులిన్ ఉంటేనే, గ్లూకోజ్ కణాలలోకి వెళ్ళగలదు . ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే క్లోమగ్రంథి నుండి విడుదల అవుతుంది. మన రక్తంలో ఉండే ఇన్సులిన్ ని బట్టి క్లోమగ్రంథి విడుదలవుతుంది. ఒకవేళ క్లోమగ్రంథి అనేది కావలసినంత ఇన్సులిన్ విడుదల చేయకపోతే రక్తంలోని గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లకుండా మన రక్తంలోనే ఉండిపోతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అనే షుగర్స్ మన రక్తంలోనే ఉండిపోతే దాన్ని Diabetes (డయాబెటిస్) లేదా షుగర్ వ్యాధి వచ్చింది అంటారు.ఈ Diabetes (డయాబెటిస్) షుగర్ లో కొన్ని రకాలు ఉన్నాయ్ అవేంటో చూద్దాం. 


Type 1 Diabetes (డయాబెటిస్) . 


ఇది Auto  Immune  Condition. అంటే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ను విడుదల చేసే బీటా కణాలను పొరపాటును మనలో ఉండే మన రోగనిరోధక శక్తి నాశనం చేస్తుంది. అలా బీటా కణాలు నాశనం అవ్వడం వలన కొంతమందిలో ఇన్సులిన్ విడుదల అవదు. ఇది Type 1 Diabetes (డయాబెటిస్), ఇది ఎక్కువగా చిన్న పిల్లలలో వస్తుంది. ఒకవేళ ఈ Type 1 Diabetes (డయాబెటిస్) వస్తే  వాళ్లు జీవితాంతం బయట నుండి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎప్పుడో ఒకసారి జ్వరం వస్తేనే ఇంజక్షన్ వేసుకోవడానికి భయపడతాం. అలాంటిది Type 1 Diabetes (డయాబెటిస్) వచ్చిన వారు  ప్రతిరోజు ఇన్సులిన్ని తమ శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. 


రెండవది Type 2 Diabetes ( డయాబెటిస్ )


ఇది ఎక్కువగా పెద్దవాళ్లలో వస్తుంది. కొంతమంది బయట దొరికే బర్గర్లు, పిజ్జా లు ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏది పడితే అది తినేస్తుంటారు. దీని వల్ల బాడీ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగి పోయిన ఇన్సులిన్ని  బ్యాలెన్స్ చేయడానికి క్లోమగ్రంథి మరింత ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. అలా విడుదల చేసి చేసి దాని మీద ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో క్లోమ గ్రంధి ఇన్సులిన్ విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ Type 2 Diabetes (డయాబెటిస్) వస్తుంది. Type 2 Diabetes (డయాబెటిస్) ఉన్న వాళ్లలో  ఇన్సులిన్ విడుదల అవుతుంది లేదా తక్కువగా విడుదలవుతుంది, కానీ ఈ ఇన్సులిన్ కి తమ శరీరంలో ఉన్న కణాలు స్పందించవు.అందువల్ల గ్లూకోజ్ అనేది కణాలలోకి వెళ్ళదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే బాడీలో ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు, ఈ కణానికి ఉండే లాక్స్ అనేవి ఎక్కడికక్కడ కొవ్వుతో పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. అయితే Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళ లో 90 నుండి 92 శాతం ఈ Type 2 Diabetes (డయాబెటిస్) ఉన్నవాళ్లే. దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం, శరీరానికి సరిపడినంత పని లేకపోవడం, వంశపారంపర్యంగా రావడం. 



మూడో రకం కూడా ఉంది, అది GESTATIONAL DIABETES  “ జెస్టేషనల్ డయాబెటిస్” .ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు వస్తుంది. కానీ శాశ్వతంగా ఉండదు కేవలం గర్భంతో ఉన్న సమయం వరకు మాత్రమే ఉంటుంది, అది కూడా ఐదు నుంచి ఏడు శాతం మందికి మాత్రమే వస్తుంది. ఈ సమయంలో మంచి ఆహారం తీసుకుంటూ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకుంటే చాలు. కానీ నిర్లక్ష్యం వహిస్తే తల్లికి మరియు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదమే. 


షుగర్ వ్యాధి  Diabetes (డయాబెటిస్)  వచ్చినప్పుడు మన శరీరంలో ఏమి జరుగుతుంది..?


ఈ Diabetes(డయాబెటిస్) అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మన శరీరంలో ఏయే భాగాలు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం. Diabetes (డయాబెటిస్) వచ్చిన వాళ్లలో ముఖ్యంగా కళ్ళు, గుండె, కిడ్నీలు, మరియు కాళ్ళు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో చిక్కగా మారి పోయి ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. అందుకే ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాలలో రెండు రకాలు ఉంటాయి చిన్నవి మరియు పెద్దవి, చిన్నవి మరియు సన్నగా ఉండే రక్తనాళాలు కళ్ళు మరియు కిడ్నీలలో ఉంటాయి, పెద్దవి గుండె మరియు కాళ్లల్లో ఉంటాయి. ఈ గ్లూకోజ్ అనేది కళ్ళలోని లాసిక్ మధ్యన చేరుకుపోవడం వల్ల కళ్ళు మసకగా కనబడతాయి. అలాగే మన శరీరం, రక్తంలో ఎక్కువగా పేరుకుపోయిన గ్లూకోజ్ ని  కిడ్నీల ద్వారా బయటకు పంపిస్తుంది.అందుకే  Diabetes(డయాబెటిస్) ఉన్నవారికి ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుంది. ఇది కిడ్నీ లకు భారంగా మారడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో కిడ్నీలు కూడా తొందరగా దెబ్బతింటాయి. మనం ముందు చెప్పుకున్నట్టు గ్లూకోస్ తో నిండిపోయిన రక్తం  ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ఒకవేళ కాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే ఆ భాగానికి రక్తం ద్వారా సరిగ్గా ఆక్సిజన్ చేరకపోవడంతో త్వరగా గాయాలు మానవు, కొన్ని పరిస్థితులలో అవి కుళ్లిపోతూ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ భాగాన్ని తెసివేయడమే మార్గం అవుతుంది.    


షుగర్ వ్యాధి  Diabetes (డయాబెటిస్)  వచ్చినప్పుడు మన శరీరంలో కనిపించే లక్షణాలు ఏమిటి..?


https://itsforyoum.blogspot.com/

మన శరీరంలో ఉండే కణాలలోకి గ్లూకోజ్ వెళితేనే మనకు శక్తి విదలవుతుంది.కానీ Diabetes  (డయాబెటిస్) ఉన్నవారిలో ఈ గ్లూకోజ్ అనేది కణాలలోకి వెళ్లకపోవడంతో శరీరానికి కావాల్సినంత శక్తి విదలవకపోవడం వల్ల Diabetes (డయాబెటిస్) ఉన్నవారికి ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంది. అయితే బాడీ కి ఎనర్జీ కావాలి కాబట్టి అందుకోసం మన బాడీ శరీరంలో ఉన్న కొవ్వును వాడుకుంటుంది. అందుకే Diabetes (డయాబెటిస్) వచ్చిన వారు ఎటువంటి కారణం లేకుండానే సడెన్ గా బరువు తగ్గిపోతుంటారు. అదే విదంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల నరాలలోని చివరి భాగాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు శరీరంలోని కొన్ని భాగాలలో స్పర్శ గానీ నొప్పి గానీ తెలియదు. సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో ఎదో ఒక భాగంపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది. కానీ Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి ఆలా కాదు, ఇది ఒక్కసారి వస్తే బాడీ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది.ఇది కంటికి కనిపించకుండా లోపలే పాకేస్తుంది. శరీరంలోని అవయవాలన్నీ ఒకదానివెంట ఒకటి తమ శక్తిని కోల్పోతాయి. కళ్ళు మసకగా కనిపించడం, ఎక్కువగా దాహం వేయడం, ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా తొందరగా బరువు తగ్గడం, ఎక్కువగా యూరిన్ కి వెళ్లడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం, ఏదైనా గాయం అయితే తొందరగా మానకపోవడం ఇవన్నీ కూడా Diabetes (డయాబెటిస్) ఉంది అని చెప్పే లక్షణాలు. 


ఇందులో ప్రీ- డయాబెటిస్ Pre-Diabetes అనే కండిషన్ ఒకటి ఉంటుంది, అంటే బాడీలో షుగర్ లెవెల్స్ సాధారణ లెవెల్స్ కన్నా ఎక్కువగా, Diabetes(డయాబెటిస్) షుగర్ లెవెల్స్ కన్నా తక్కువగా ఉంటుంది.చాలా మందికి తాము ఈ కండీషన్ లో ఉన్నట్టు తెలియదు. ఎంత కాలమైతే దీనిని గుర్తించకుండా గడిపేస్తామో అది అంత వరకు తీవ్రంగా ప్రమాదకరంగా మారిపోతుంది. ఈ కండిషన్ లో ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే Diabetes (డయాబెటిస్) బారిన పడకుండా ఉండవచ్చు.  


 Diabetes(డయాబెటిస్) షుగర్ వ్యాధి  రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?


ఈ Diabetes (డయాబెటిస్) రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనది సరైన డైట్ లేకపోవడం.బయట దొరికే జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి సరైన పని లేకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం, మన పూర్వీకుల నుండి  పారంపర్యంగా  రావడం, ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా బరువు ఉండడం ఈ కారణాల వాళ్ళ Diabetes( డయాబెటిస్ ) వచ్చే అవకాశం ఉంది. అయితే మన ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే మన బాడీ BMI అనేది ఎంత ఉందొ తెలుసుకోవాలి. BMI అంటే Body Mass Index. ఈ BMI ని చెక్ చేసుకోవడానికి ఈ పోస్ట్ చివర్లో ఒక వెబ్సైటు లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్లి  మీ వయస్సు , మీరు ఆడా /మగా , మీ ఎత్తు, బరువును  ఎంటర్ చేసి మీ బాడీ  యొక్క BMI ఎంత ఉందొ తెలుసుకోవచ్చు. ఈ BMI అనేది 18.5 నుండి 24.9 మధ్యలో వస్తే మీరు ఆరోగ్యాంగా ఉన్నట్టు లెక్క. Diabetes( డయాబెటిస్ ) లో వంశపారంపర్యంగా వచ్చే వాటికి మనం ఏమి చేయలేము, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిగిలిన మార్గాల ద్వారా Diabetes( డయాబెటిస్ )రాకుండా జాగ్రత్త పడవచ్చు .


షుగర్ వ్యాధి  Diabetes (డయాబెటిస్) వచ్చిన వారు ఏమి చేయాలి..?


 ఒకవేళ ఇంతకు ముందే Diabetes (డయాబెటిస్) షుగర్ ఉన్నా కూడా ఎక్కువగా ఊహించుకుని భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే అదృష్టం కొద్దీ మనం ముందు చెప్పుకున్న టైప్ 1 Diabetes (డయాబెటిస్) అనేది కేవలం 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే ఉంటుంది. మిగిలింది మనం కంట్రోల్ చేయగలిగింది టైప్ 2 Diabetes (డయాబెటిస్). ఈ Diabetes (డయాబెటిస్) ఉన్నాగానీ బాడీ లో గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకుంటూ హ్యాపీగానే ఉండవచ్చు. దాని కోసం మనం తీసుకొనే డైట్ కంట్రోల్ చేసుకోవాలి. శారీరక శ్రమను పెంచాలి, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక గంట వ్యాయామం గాని యోగా గానీ చేయాలి. ఒకవేళ బరువు ఎక్కువగా ఉన్నవారైతే ముందు బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకెత్తిన గింజలు లాంటివి తినాలి,జ్యూస్ ల కన్నా డైరెక్ట్ గా పళ్ళని ఎక్కువగా తినాలి. ఎందుకంటే జ్యూస్ గా చేసి దానిని వడకట్టినప్పుడు అందులో ఉండే పీచు పదార్థాలు అన్నీ పోతాయి. కానీ అవే  మనకు చాలా ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవెల్స్  కంట్రోల్లో ఉంటాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి, దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే ఏం తినాలి ఎంత తినాలి అనేది మన డాక్టర్ ని ముందు అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీలో గ్లూకోస్ లెవెల్స్ ఒక్కో రకంగా ఉంటాయి. మన బాడీ లో గ్లూకోస్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయి అనేది మన డాక్టర్ కి తెలుస్తుంది. ఆయా లెవెల్స్ ని  బట్టి డాక్టర్ సూచించిన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవాలి.


చివరగా ఇంతకుముందు ఈ Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి అనేది, ఎప్పుడో  50 నుంచి 60 ఏళ్ల మధ్యలో వచ్చేది, కానీ  ఇప్పుడు యువకులలోనే ఎక్కువ మంది Pre-Diabetes ప్రీ డయాబెటిస్ బారిన పడుతూ ఉన్నారు.ఈ Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి మన లో ఉన్నట్టు మనకు తెలియకుండానే మన శరీరం మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. కాబట్టి కనీసం 30 సంవత్సరాలు దాటిన వారు సంవత్సరానికి ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి తో బాధపడుతూ ప్రతిరోజు గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ని ఇంజెక్ట్ చేసుకోవడం అంటే ఎంత బాధ, ఖర్చుతో కూడుకున్నదో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే మీ  బంధువుల లో గాని స్నేహితులు గాని ఎవరైనా ఈ Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి తో బాధపడుతూ ఉంటే వారితో ఈ విషయాలను షేర్ చేసుకోండి, వారికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 


ఈ పోస్ట్ ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారందరికీ Diabetes (డయాబెటిస్) షుగర్ వ్యాధి పై అవగాహన కల్పించండి.



👉👉👉👉మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి ....


👉👉👉గుండెపోటు ఎందుకు వస్తుంది ..?


👉👉👉 జీవితంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు 


👉👉👉కేవలం 5 నిమిషాలలో ఉచితంగా పాన్ కార్డు PAN CARD  పొందే విధానం 

1 Comments

  1. చాలా మంచి విషయాలు చెప్పారు... super 👌👌👌

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post