Chamkeela Angeelesi - Song Lyrics | Dasara

Chamkeela Angeelesi - Song Lyrics in Telugu - RAM MIRIYALA, DHEE Lyrics - Dasara


Chamkeela Angeelesi - Song Lyrics in Telugu


Singer RAM MIRIYALA, DHEE
Composer Santhosh Narayanan
Music Santhosh Narayanan
Song WriterKASARLA SHYAM

Lyrics of Chamkeela Angeelesi -  in Telugu 


చమ్కీలా అంగిలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు అయినా బెట్టి
కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే
సినిగిన బనీనేసి ఓ వదినే
నట్టింట్ల కుసుంటాడే ఓ వదినే
మాసిన లుంగీ ఎసి ఇప్పుడు
మంచంలనే పంటాడే


పెండ్లయినా కొత్తలా అత్థర్లు పూసిన్నే
నీ సీర సింగులు పట్టి ఎనకేనకే తిరిగిన్నె
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
సెక్కర లెక్క నీ మాటలుంటుండే
మారే నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే


కడుపులో ఇంత పోసి ఓ వదినే
కొడతడే బండకేసి ఓ వదినే
అమవాస పున్నానికో అట్లట్లా
అక్కరకు పక్కకొత్తాడే
చమ్కీలా అంగిలోడే
నన్ చమ్కీలమ్మేత్తడే


వీడు వంటింట్లో నేనుంటే
చాటుంగా వత్తుండె
వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే
తైతక్కలాడకంటుండే


కంట నీరన్న వెట్టకుండా
సంటి బిడ్డ లెక్క నిన్ను
అలుగుతుంటే బుధరగియ్యలేదా
నువ్వు సీటికి మాటికీ
గింతదాన్ని గంత జెసి
ఇజ్జాతంతా బజారలేస్తలేవా
ఏ గాలి సోకేనో వెన్నెత్తి తిరిగెనో
పాతబడ్డానేమో చాతనైత లేదో
ఉల్టా నన్నటిలా మంది ముంగట్ల
బదనాం చెత్తడే
చమ్కీలా అంగిలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు అయినా బెట్టి
కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే


నోరుదీసి అడగరాదురా బామ్మర్ది
చెప్పింది చెయ్యదురా బామ్మర్ది
పక్కింటిలా కూసుంటది నా మీద
చాడీలు చెప్తుంటాది
నా గొంతు కోసిరంటూ బామ్మర్ది
శోకాలు పెడుతుంటాది బామ్మర్ది
ముచ్చట్లు చెప్పబోతే మీ అక్క
మూతంతా తిప్పుతుంటది
సీకట్ల ఉన్న వాకిట్ల ఉన్నా
కంటికి రేప్పొలే కాస్తాడు మొగడు
ఎంత లొల్లాయినా నువ్వెంట ఉంటె
ఎదురు నిలిసి వాడు గెలిసి వస్తాడు
గోసలని చూస్తా ఉన్నా ఏదైనా
గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పంచ పాణాలులే




Chamkeela Angeelesi - Lyrical Song Watch Video




Click here for more Song's Lyrics  👉👉👉 CLICK HERE 

 Click here for more interesting topics 👉👉👉  CLICK HERE


Post a Comment

Previous Post Next Post